హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గరివిడి లక్ష్మి అసిస్టెంట్ డైరెక్టర్‌గా జిల్లా వాసి

VZM: వంగర మండలం శివ్వాంకు చెందిన యువకుడు ముంజు గణేష్ గరివిడి లక్ష్మి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. డిగ్రీ పూర్తి చేసిన ఆయన పూరి జగన్నాథ్ వద్ద మేకింగ్, స్క్రీన్ ప్లే, పాటలు, కథల రైటింగ్ మెలుకువలు నేర్చుకున్నారు. తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి వ్యవసాయం చేస్తూ సినీ రంగం వైపు ఆయనను ప్రోత్సహించారు. ఈ నేపథ్యంలో ఆయనను పలువురు అభినందిస్తున్నారు.