హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్వేచ్ఛా రథం' ప్రచార వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్

NRML: వెట్టి చాకిరి నిర్మూలనకు అధికారులు సమన్వయంతో కృషిచేయాలని, కార్మికుల హక్కులు, చట్టాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వెట్టి చాకిరి నిర్మూలన, కార్మికుల హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన స్వేచ్ఛారథం ప్రచార వాహనాన్ని సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జెండా ఊపి ప్రారంభించారు.