హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.4.03 కోట్ల విలువైన బంగారం పట్టివేత

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి ఈకే-512 విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా, ఫ్లోర్ స్ప్రింగ్‌లో దాచి ఉంచిన 3.20 కిలోల బంగారు కడ్డీలు బయటపడ్డాయి. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.4.03 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఘటనపై కస్టమ్స్ చట్టం-1962 కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.