హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినియోగదారులతో షోరూమ్‌లు కళకళ

ASR: దసరా పండుగ వేళ ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలు ఊపందుకున్నాయి. గతేడాదితో పోలిస్తే విక్రయాలు 15 నుంచి 20 శాతం పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. సాధారణ రోజుల్లో 10 నుంచి 15 అమ్ముడయ్యే వస్తువులు పండగ పూట 40 నుంచి 60 వరకు అమ్ముడవుతున్నాయి. ఆయా వస్తువులపై పది నుంచి 30 శాతం వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నట్టు కొన్ని షోరూమ్‌ల యజమానులు చెబుతున్నారు.