హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అవనిగడ్డలో విచిత్రమైన దొంగతనం

కృష్ణా: దివిసీమలోని అవనిగడ్డలో విచిత్రమైన దొంగతనం కలకలం రేపుతోంది. బైక్ పడిపోతోందంటూ సాయం కోరిన దుండగులు, అదే సమయంలో మొబైల్ ఫోన్ చోరీ చేశారు. బైక్‌ను పైకి లేపేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన మరో వ్యక్తి అతడి జేబులోని ఫోన్‌ను చాకచక్యంగా కొట్టేశాడు. అనంతరం ఇద్దరూ బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.