AP: నంద్యాల జిల్లా దిగువ అహోబిలంలో అగ్నిప్రమాదం జరిగింది. లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో 5 బొమ్మల దుకాణాలు, కూల్‌డ్రింక్స్ షాపు, 2 హోటళ్లు దగ్ధమయ్యాయి. పోలీసులు గ్యాస్ సిలిండర్లను బయటకు తరలించారు. హోటల్‌లో నిద్రిస్తున్న ఐదుగురిని సురక్షితంగా కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
అగ్నిప్రమాదం.. పలు దుకాణాలు దగ్ధం


