హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణే లక్ష్యం: ఎస్సై

CTR: పెనుమూరు మండలంలో ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.