కోనసీమ: మండపేట పురపాలక సంఘ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాల పరిశీలన సోమవారం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ టీవీ రంగారావు తెలిపారు. ఆలమూరు రోడ్డులోని శ్రీ అన్నపూర్ణ హైస్కూల్లో ఉదయం 11 గంటల నుంచి ఆయా వార్డుల ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన


