హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు కార్పొరేషన్‌.. భారీగా నామినేషన్లు

నెల్లూరు నగర పాలక సంస్థకు వచ్చిన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. మేయర్‌గా పోటీ చేసేందుకు అభ్యర్థుల నుంచి 35 దరఖాస్తులు వచ్చాయి. అదే విధంగా వార్డుల్లో కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు 663 దరఖాస్తులు వచ్చినట్లు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ సోమవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. నామినేషన్లు వేయడానికి గడువు ముగిసిందన్నారు.