అన్నమయ్య: రాజంపేట మున్సిపల్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి అర్హులైన సర్వీస్ ఓటర్లు, ఉపాధ్యాయులు, ఇతర శాఖల ఉద్యోగులు ఫారం-10A పొందేందుకు ప్రత్యేక సౌకర్యం కల్పించినట్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మి నారాయణ తెలిపారు. అర్హులైన ఉద్యోగులు కార్యాలయానికి వచ్చి ఫారం తీసుకుని, పూర్తి చేసిన దరఖాస్తును సంబంధిత అధికారులకు అక్కడే సమర్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోస్టల్ బ్యాలెట్‌కు ప్రత్యేక సౌకర్యం : కమిషనర్


