TG: బస్సుల్లో అధిక ఛార్జీల వసూళ్లపై మాజీమంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. పండుగ వేళ ఆర్టీసీ ఛార్జీలు డబుల్ చేశారని మండిపడ్డారు. రెగ్యులర్ బస్సులకే స్పెషల్ బస్సు బోర్డులు పెట్టారని తెలిపారు. JBS - కరీంనగర్ ధర రూ.230 నుంచి రూ.400కు పెంచారని ఆరోపించారు. పండుగల వేళ పేదలపై భారం వేశారని పేర్కొన్నారు. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
బస్సుల్లో అధిక ఛార్జీలు.. హరీష్ రావు ట్వీట్


