హైదరాబాద్: 28°C
వార్తలు

సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తున్నాం: భట్టి

TG: ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. ఏన్కూరు - నాచారం నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. భద్రాచలం ఆలయ అభివృద్దికి రూ.276 కోట్లు కేటాయించామని తెలిపారు. రూ.90 వేల కోట్లతో రహదారుల అభివృద్ది పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని చెప్పారు.