AP: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిన్నటి రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే ఏర్పాట్లు చేశారు.
వార్తలు
బ్రహ్మోత్సవాలు.. నర్తన కృష్ణుడిగా దర్శనం


