TG: ఎల్నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరువు విలయతాండవం చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొంత వర్షాలు పడినప్పటికీ, తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఆ దేవుడు కరుణించి సమృద్దిగా వర్షాలు కురిపిస్తే రైతులంతా ఆనందంగా ఉంటారని పేర్కొన్నారు.
వార్తలు
రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు: పొన్నం


