హైదరాబాద్: 28°C
వార్తలు

‘ఏసీ ఉంటే పింఛన్ రాదా?’

ఇంట్లో ఏసీ ఉందనే కారణంతో సంక్షేమ పింఛన్లను నిలిపివేయడం సరికాదని కేరళం స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి కేఎం షాజీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రోజుల్లో ఏసీ అనేది విలాసవంతమైన వస్తువు కాదని, ప్రత్యేక వైద్య పరిస్థితులున్న రోగులకు అది ప్రాథమిక అవసరమని ఆయన పేర్కొన్నారు. కాబట్టి పింఛన్ల అర్హత నిబంధనల నుంచి ఏసీ నిబంధనను తొలగించాలని కోరుతూ ఆర్థిక శాఖకు ఆయన అధికారికంగా లేఖ రాశారు.