KNR: కరీంనగర్లో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా సాగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో పండుగ సందడి కనిపించింది. సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు, కుటుంబ సభ్యులు అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా జరిగిన సంబరాలను గంగుల కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించారు.
వార్తలు
ఎమ్మెల్యే గంగుల నివాసంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు


