హైదరాబాద్: 28°C
వార్తలు

వైసీపీకి షాక్.. టీడీపీలోకి 30 కుటుంబాలు

నెల్లూరు జిల్లా బోగోలు మండలం కప్పరాలతిప్ప మేజర్ పంచాయతీకి చెందిన 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీ కార్యాలయంలో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు సూచించారు.