మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం మహిళలు, యువతులు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు ఆకట్టుకున్నాయి. మహిళలు సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ పాటలు పాడటం ఆకట్టుకుంది. మన సంస్కృతిని గౌరవించుకోవడం మన బాధ్యత అని మహిళలు పేర్కొన్నారు.
వార్తలు
విశ్వనాథ ఆలయంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు


