హైదరాబాద్: 28°C
వార్తలు

టీడీపీలోకి 100మంది చేరికలు

ASR: కొయ్యూరు మండలంలోని యూ.చీడిపాలెంలో కాంగ్రెస్ మాజీ సర్పంచ్ చంద్రకళతో పాటు సుమారు 100మంది నేతలు, కార్యకర్తలు ఆదివారం టీడీపీలో చేరారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, జీసీసీ మాజీ చైర్మన్ ఎంవీవీ ప్రసాద్ ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరామని వారు తెలిపారు.