హైదరాబాద్: 28°C
వార్తలు

గుడికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఐదుగురు మృతి

రోడ్డుపై గుంతను తప్పించబోయి అదుపుతప్పిన కారును బస్సు వేగంగా ఢీకొనడంతో చిన్నారితో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తుల్జాపూర్‌లో(MH) దర్శనం చేసుకుని మజల్‌గావ్‌కు చెందిన కుటుంబం కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా, బస్సులో ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.