హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాగునీటిని వృథా చేస్తే చర్యలు

WNP: రేవల్లి గ్రామంలో తాగునీటిని వృథా చేయవద్దని సర్పంచ్ రాజయ్య ప్రజలకు సూచించారు. ప్రతి ఇంటికి నల్లా కుళాయిలు ఏర్పాటు చేసుకుని, నీటిని పొదుపుగా వినియోగించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించి నీటిని వృథా చేస్తే నోటీసుల అనంతరం నల్లా కనెక్షన్లు నిలిపివేస్తామని హెచ్చరించారు. ప్రతి నీటి బొట్టును కాపాడుతూ గ్రామంలో అందరికీ తాగునీరు అందేలా ప్రజలంతా సహకరించాలని కోరారు.