హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామాలయానికి వీల్‌చైర్ల విరాళం

BDK: భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధుల కోసం రోటరీ క్లబ్ రూ.25 వేల విలువైన 5 ఆధునిక వీల్‌చైర్లను విరాళంగా ఇచ్చింది. ఆలయ ఈఓ దామోదర్ రావు ఆదివారం వాటిని స్వీకరించి, సంస్థ సేవలను కొనియాడారు. వీటి ద్వారా భక్తులు ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకోవచ్చన్నారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు షేక్ అజీమ్, ప్రతినిధులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.