హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజర్షి షా గూడ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం: కలెక్టర్

ADB: ఆదిలాబాద్ గ్రామీణ మండలం రాజర్షి షా గూడను అన్ని వసతులతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం గ్రామంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.