NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తిలో దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని నియోజకవర్గ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని వేడుకున్నారు. సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పెద్ద కాపర్తి లో అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్


