హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప్పరిగడ్డలో తీరిన తాగునీటి సమస్య

RR: ఉప్పరిగడ్డ గ్రామంలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్య పరిష్కారమైంది. సర్పంచ్ చందు నాయక్ విజ్ఞప్తిపై స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించి, తన సొంత నిధులతో నీటి సరఫరా ఏర్పాట్లు చేయించారు. ఉప సర్పంచ్ తిరుపతయ్య దగ్గరుండి బోరు వేయించారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించిన ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.