హైదరాబాద్: 28°C
తెలంగాణ

డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు

MDCL: బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బాబాయ్ హోటల్ ఎదుట రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఎలక్ట్రిక్ కారు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు వాహనదారులు గాయపడినట్లు సమాచారం. ప్రమాదంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారును క్రేన్ సహాయంతో తొలగించారు.