హైదరాబాద్: 28°C
తెలంగాణ

HIV బాధితులకు సహాయం

MDK: హెచ్‌ఐవీ బాధితులు మనోధైర్యం కోల్పోవద్దని ఫౌండేషన్ అధ్యక్షుడు ఆజాద్ జానీ అన్నారు. ఆదివారం తూప్రాన్‌లో సద్దుల బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని 32 మంది బాధితులకు దుస్తులు, పౌష్టికాహారం పంపిణీ చేశారు. తూప్రాన్‌తో పాటు మనోహరాబాద్, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట, చేగుంట, నార్సింగి మండలాల్లోని బాధితులకు ఫౌండేషన్ ద్వారా సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.