హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగారంలో వైభవంగా చండీ హోమం

NRPT: నారాయణపేట మండలం సింగారంలోని గంగాభవాని ఆలయం వద్ద ఆదివారం దుర్గామాత మండపంలో చండీ హోమం నిర్వహించారు. అమ్మవారు దుర్గామాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.