ASF: తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న NHM ఉద్యోగులు ఆరో రోజు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట పరిసరాలను శుభ్రపరుస్తూ తమ ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. సమ్మెలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
తెలంగాణ
VIDEO: 6వ రోజు సమ్మెలో NHM ఉద్యోగుల వినూత్న నిరసన


