హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతి

VKB: బషీరాబాద్ మండలంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి ముఖం తీవ్రంగా దెబ్బతినడంతో గుర్తించడం కష్టంగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు గల కారణాలు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి, మృతుడి గుర్తింపునకు చర్యలు తీసుకుంటున్నారు.