హైదరాబాద్: 28°C
వార్తలు

కోవా, పన్నీర్, మాంసం రవాణాపై నిబంధనలు

కోవా, పన్నీర్, మాంసం, చేపలు వంటి త్వరగా పాడయ్యే ఆహార పదార్థాల నిల్వ, రవాణాపై FSSAI కీలక అడ్వైజరీ జారీ చేసింది. సరైన ఉష్ణోగ్రత నియంత్రణలో లేకపోతే బ్యాక్టీరియా పెరిగే ముప్పు ఉంటుందని హెచ్చరించింది. ఆహార వ్యాపార నిర్వాహకులు(FBOs) సరఫరా గొలుసు అంతటా శుచి, పరిశుభ్రతతో పాటు నిర్దేశిత ఉష్ణోగ్రత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, లేదంటే కఠిన చర్యలుంటాయని స్పష్టం చేసింది.