హైదరాబాద్: 28°C
తెలంగాణ

జడ్చర్లలో రావణ దహనం, డ్రోన్ షో: MLA

MBNR: జడ్చర్లలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న రావణ దహనం, డ్రోన్ షో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని పలు అమ్మవారి మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు కుటుంబ సమేతంగా తరలివచ్చి వేడుకల్లో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.