HNK: భీమదేవరపల్లి మండలం మల్లికుదుర్లలో వ్యవసాయ భూమి వద్ద నీటి విషయంలో ఇద్దరు రైతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఇరువురు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఘటనపై ఇద్దరూ వేలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆదివారం పోలీసులు ఇరువురిపై రెండు కేసులు నమోదు చేసినట్లు ఎస్సై మెరుగు రాజు తెలిపారు.
తెలంగాణ
నీటి విషయంలో రైతుల మధ్య ఘర్షణ


