KKD: శంఖవరం మండలం అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ఆదివారం ఆన్లైన్ టికెట్ల విభాగాన్ని ఆలయ ఈవో చక్రధరరావు పరిశీలించారు. ఆన్లైన్ ద్వారా టికెట్ల జారీ ప్రక్రియ, భక్తులకు అందుతున్న సేవల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. టికెట్ల జారీ విషయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఆన్లైన్ టికెట్ల విభాగాన్ని పరిశీలించిన ఈవో


