హైదరాబాద్: 28°C
వార్తలు

తొక్కిసలాట.. వాతావరణ శాఖ వైఫల్యమే కారణం?

కోల్‌కతా తొక్కిసలాటకు వాతావరణ శాఖ వైఫల్యం కూడా కారణమని తెలుస్తోంది. మహానగరంలో నిన్న తేలికపాటి వర్షం పడుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ రుతుపవనాల తిరోగమనం కారణంగా భారీ వాన కురిసింది. వర్షం నుంచి తలదాచుకునేందుకు భక్తులు అమ్మవారి మండపంలోనికి పరుగులు తీశారు. ఈ క్రమంతో జనం జారికిందపడడంతో తొక్కిసలాట జరిగి 19 మంది ప్రాణాలు విడిచారు. పలువురు గాయపడ్డారు.