హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెనుగుదురులో తాగునీటి పైపులైన్ లీకేజీ

KKD: కరప మండలం పెనుగుదురు నుంచి కరప వెళ్లే తాగునీటి పైపులైన్ పగిలిపోవడంతో నీరు వృథాగా పోతోంది. లీకేజీతో రోడ్డు దెబ్బతినడంతో పాటు పక్కనున్న ఇళ్లలోకి నీరు చేరుతోంది. గ్రామానికి పూర్తిస్థాయిలో తాగునీరు అందడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు.