AP: తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రికి చంద్రప్రభ వాహనసేవలో మలయప్పస్వామి అభయప్రదానం చేయనున్నారు. వివిధ రాష్ట్రాలు, విదేశాలకు చెందిన కళాకారులు నాలుగు మాడవీధుల్లో తమ అద్భుత సాంస్కృతిక ప్రదర్శనలతో భక్తులను అలరిస్తున్నారు. భక్తులకు టీటీడీ అన్ని వసతులు కల్పించింది.
భక్తి
తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు


