TG: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
వార్తలు
రాష్ట్రంలో 3 రోజులపాటు వర్షాలు


