హైదరాబాద్: 28°C
వార్తలు

పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై కేసు

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పెళ్లి పేరుతో మోసగించడంతో 16 ఏళ్ల బాలిక పండంటి పాపకు జన్మనిచ్చింది. స్కూల్ విద్యార్థి అయిన బాలికకు గత ఏడాది ఒక యువకుడు పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో గర్భం దాల్చిన బాలిక ఇటీవల ప్రసవించింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.