హైదరాబాద్: 28°C
వార్తలు

'ఎన్నికల్లోపే నోటిఫికేషన్లు ఇవ్వాలి'

ADB: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసేలోపే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ఏజెన్సీ సాధన సమితి, నిరుద్యోగ జేఏసీ నేత జాదవ్ సోమేశ్ డిమాండ్ చేశారు. శనివారం ఉట్నూర్‌లో నిరుద్యోగులతో కలిసి మాట్లాడారు. మెగా డీఎస్సీ, ఏజెన్సీ డీఎస్సీ ప్రకటించాలని, అటవీ శాఖ, ఏజెన్సీలోని 29 రంగాల్లో ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి న్యాయం చేయాలన్నారు.