ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. మంచి సన్నబియ్యం 25 కేజీల బస్తా రూ.2వేలకు పైగా పలుకుతోంది. మధ్య, దిగువ తరగతి కుటుంబాల వారు బియ్యం కొనలేకపోతున్నామని వాపోతున్నారు. మరింత పెరిగి రూ.3వేల వరకు చేరే అవకాశం ఉందని దుకాణదారులు చెబుతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న కుటుంబాలకు బియ్యం ధరల పెరుగుదల మరింత భారంగా మారింది.
వార్తలు
ప్రకాశం జిల్లాలో పెరిగిన బియ్యం ధరలు


