హైదరాబాద్: 28°C
వార్తలు

చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలను కట్టడి చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చెరుకు నుంచి ఇథనాల్ తయారు చేసే విధానానికి తాత్కాలికంగా బ్రేక్ చేసింది. చక్కెరతో పాటు చెరుకు రసం, షుగర్ సిరప్, బీ-హెవీ మొలాసిస్ వాడకాన్ని నిషేధించింది. దీంతో ఇథనాల్ కోసం మొక్కజొన్న, విరిగిన బియ్యం, అదనపు ఆహార ధ్యాన్యాలు వాడాలని కంపెనీలకు సూచించింది.