హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీ నేతకు హైకోర్టులో భారీ ఊరట

కర్ణాటక హైకోర్టులో బీజేపీ నేత అమిత్ మాల్వియాకు భారీ ఊరట లభించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ముఖాలను కలిపి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో అమిత్ పోస్ట్ చేశారు. దీంతో అమిత్‌పై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీనిపై విచారణ జరిగిన ధర్మాసనం ఈ అంశంపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనంటూ కేసులను కొట్టివేసింది.