ప్రకాశం: రెండవ రోజు నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 88 కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు, 3 ఛైర్మన్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు స్పెషల్ ఆఫీసర్, ఆర్డీవో శివరామిరెడ్డి తెలిపారు. టీడీపీ 34, వైసీపీ 36, జనసేన 11, బీజేపీ 1, సీపీఐ 2, ఇతరులు 4 వచ్చినట్లు చెప్పారు. రేపు నామినేషన్ వేసే అభ్యర్థులు మధ్యాహ్నం 2:30 వచ్చి నామినేషన్ దాఖలు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'2వ రోజు 88 నామినేషన్లు దాఖలు'


