హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలకు 72 పోలింగ్ కేంద్రాలు సిద్ధం

కోనసీమ: ఈ నెల 28న జరిగే అమలాపురం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. పట్టణంలో ఎన్నికల నిర్వహణకు మొత్తం 72 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. వీటికి అవసరమైన సామగ్రిని మున్సిపాలిటీలోని ప్రత్యేక గదిలో భద్రపరిచారు. ప్రతి కేంద్రానికి కావాల్సిన ఓటర్ల జాబితాలు, అట్ట పెట్టెలు, ఇతర పోలింగ్ సామాగ్రిని తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.