హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో భారీ వర్షం

చిత్తూరులో శనివారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం పడింది. భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు వర్షపు నీటితో జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, బయటకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.