హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ మాజీ నగర అధ్యక్షుడు రాజీనామా

చిత్తూరు టీడీపీ మాజీ నగర అధ్యక్షుడు తుంగ నరేష్ చౌదరి పార్టీ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన CTR ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. డబ్బున్న వారికే ప్రాధాన్యతనిస్తూ మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు లేకపోవడం వలన ఆవేదన వ్యక్తం చేశారు.