హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధితులకు ఎమ్మెల్యే తక్షణ సాయం

ASR: అరకు-పాడేరు ప్రధాన రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం బోల్తాపడి యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం వెంటనే తన కాన్వాయ్‌ను ఆపారు. క్షతగాత్రులను ఆటోలో డుంబ్రిగూడ పీహెచ్‌సీకి తరలించేలా ఏర్పాట్లు చేశారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యేను పలువురు అభినందించారు.