VZM: గరివిడిలో ఓ ఇంజనీరింగ్ కళాశాలలో దసరా సంబరాలు అంబరాన్ని అంటాయి. దుర్గా దేవికి కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి కొలుచుకున్నారు. కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక బతుకమ్మ ఆటలు ఆడారు. విద్యార్థులు సంప్రదాయ వస్త్రాలతో ఆకట్టుకున్నారు. ముగ్గులు పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు.
ఆంధ్రప్రదేశ్
గరివిడిలో అంబరాన్ని అంటిన దసరా సంబరాలు


