NRML: ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ BJYM ఆధ్వర్యంలో భైంసా పట్టణంలోని రాజునగర్ దుర్గామాత మండపం ముందు నిరసన చేపట్టారు. నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాల భర్తీ, రాజీవ్ యువ వికాసం పథకం అమలులో ప్రభుత్వం విఫలమైందని నాయకులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో BJYM నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: BJYM


